నవతెలంగాణ- ఆలేరు రూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు హరిత హారం పేరుతో..అడవులను సంరక్షిస్తూ పల్లెల్లో ప్రకతి వనాలను పెంపొందించేందుకు కషి చేస్తుంటే….అదే రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారుల అండదండలతో ప్రభుత్వం కేటాయించబడిన భూమిలోని పల్లె ప్రకతి వనాలను కాజేసిన ఘటన ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలో పల్లె ప్రకతి వనంకు కేటాయించబడిన ప్రభుత్వ భూమిని (సర్వే నెంబర్ 950/2 (30 గుంటలు),894/2 (1.10)గుంటల భూమిని అక్రమ పట్టా చేసుకున్నారు ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య వియ్యంకుడు. పల్లె ప్రకతి వనంకు కేటాయించబడిన ప్రభుత్వ భూమిలో వివిధ రకాలకు చెందిన 1400 మొక్కలు నాటారు. గత రెండు సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ ఆధీనంలో పల్లె ప్రకతి వనాన్ని సంరక్షిస్తున్నారు. ఎప్పటి నుండో ఈ భూమి పై కన్నేసిన మున్సిపల్ చైర్మన్ శంకరయ్య వియ్యంకుడు రిటైర్డ్ ఎంఈఓ కడకంచి కిష్టయ్య, తన తల్లి కడకంచి చిన్న సోమక్క పేరు పై తహసీిల్దార్‌తో కుమ్మక్కై అక్రమ పట్టా చేపించారు. .ఈ విషయం పై మందనపల్లి సర్పంచ్ కోటగిరి పాండరి స్థానిక ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి తమ ఊరికి జరిగిన అన్యాయంపై… న్యాయం చేయాలంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు వినతి పత్రం ఇచ్చారు. అంతకు ముందే ఆలేరు తహసీల్దార్ రామకష్ణ ను కలిసి వినతి పత్రం అందజేశారు.ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, తహసీల్దార్ కార్యాలయానికి రాకుండా వివాదాస్పద భూములలో తలదూరుస్తున్నారన్న ఆరోపణలు తహసీల్దార్‌పై అనేకం ఉన్నాయి. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులకు కట్టబెట్టడం పై సర్వత్ర విమర్శలకు దారితీస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు తహసీల్దార్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. తహసీల్దార్ వివరణ : ఈ విషయంపై ఆలేరు తహసీల్దార్ రామకష్ణను వివరణ కోరగా తనకు పై అధికారుల నుండి, సీఎం పేషి నుండి ఫోన్ చేస్తే. పని చేసి పెట్టానని సమాధానం ఇచ్చారు. పైగా తనకు రెండు రోజుల గడువు ఇస్తే తిరిగి మళ్లి భూమిని ప్రభుత్వ ఖాతాలో చేర్చుతాం. మీడియా ప్రతినిధులు తహసీల్దార్ రామకష్ణను బీఆర్‌ఎస్ నేతలకు భూమిని పట్టా ఎందుకు చేశారని వివరణ అడగగా మళ్లీ వస్తానంటూ తహసిల్దార్ ఆఫీస్ నుండి బయటకు వెళ్లారు.