
మండలంలోని బెజ్జోరా గ్రామ శివారులో గల కప్పల వాగు నుండి కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య, జెడ్పిటిసి చౌటుపల్లి రవి, ఎంపీపీ ఆర్మూర్ మహేష్ ఆధ్వర్యంలో మంగళవారం తహసిల్దార్ శ్రీలత, ఎస్సై హరిబాబుకు వినతి పత్రం అందజేశారు. భీంగల్, బడా భీంగల్ గ్రామ పరిధిలో గల కప్పల వాగు నుండి ప్రభుత్వ అనుమంతులతో ఇసుక పాయింట్ లు నడుస్తుండగా బెజ్జోరా శివారు నుండి రాత్రి వేళలో పెద్ద పెద్ద టిప్పర్లు, ట్రాక్టర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారని కనుకటి రవాణాను అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్, పురానిపేట ఎంపీటీసీ సాయి, కౌన్సిలర్ లు సతీష్ గౌడ్, నరసయ్య, నాయకులు స్వామి, ప్రసాద్, రాజేశ్వర్, సురేష్ ,భాస్కర్ తదితరులు ఉన్నారు.