తోటపల్లి లో అక్రమ ఇసుక రవాణా..

– ట్రాక్టర్ లను పట్టుకున్న హుస్నాబాద్ ఎస్సై మహేష్

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా తరలింపు జోరుగా సాగుతుంది. ఇసుక మాఫియా ట్రాక్టర్ లలో ఇష్టరాజ్యాంగ తరలిస్తూ అమ్ముకుంటున్నారు. ఇసుక అక్రమ తరలింపు అడ్డుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో తోటపల్లిలో ఇసుక రవాణాకు అడ్డు , అదుపు లేకుండా పోయింది.
ట్రాక్టర్ లను పట్టుకున్న హుస్నాబాద్ ఎస్సై మహేష్
 తోటపల్లి వాగు నుండి శుక్రవారం అక్రమ తరలిస్తున్న ట్రాక్టర్లను హుస్నాబాద్ పోలీసులు పట్టుకున్నారు. తోటపల్లి వాగులో ట్రాక్టర్ లలో ఇసుక నింపుతున్న క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులకు సంఘటన స్థలానికి వెళ్లారు. వాగులో ఇసుక నింపి ఉన్న ఐదు ట్రాక్టర్ల ను గుర్తించి, ట్రాక్టర్ల వివరాలను పోలీసులు సేకరించారు. అక్రమ ఇసుక రవాణా తరలింపు పై సమాచారం రావడంతో ట్రాక్టర్లను పట్టుకున్నట్లుగా ఎస్ఐ మహేష్ తెలిపారు.
 అక్రమ ఇసుక రవాణా పై చర్యలేవి..?
తోటపల్లి వాగు నుండి ఇసుక మాఫియా ముఠా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలిస్తుంటే రెవిన్యూ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. తోటపల్లి వాగు నుండి చౌటుపల్లి, మల్లంపల్లి, కొత్తకొండ, అక్కన్నపేట, హుస్నాబాద్ వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూసే అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.