అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత 

నవతెలంగాణ – కుబీర్ : మహారాష్ట్ర లోని భోకర్ నుంచి తెలంగాణా రాష్టంలోని నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి అక్రమంగా మహారాష్ట్ర మద్యం సీసాలు తరలిస్తుండగా సోమవారం పట్టుకోవడం జరిగింది. కుబీర్ ఎస్ ఐ రవీందర్ తెలపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర లోని చికిలి గ్రామానికి చెందిన ర్యపాన్ వార్ శ్రీనివాస్ అనే వ్యక్తి మహారాష్ట్ర లోని భోకర్ నుంచి కుబీర్ వైపుకు టవేరా వావహనం లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను తెలంగాణ సరిహద్దు అయినా  సిరిపెల్లి చెక్ పోస్ట్  వద్ద కుబీర్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి  నెంబర్ ఎం హెచ్ 20 సి ఎస్ 7241 టవేరా లో తరలిస్తున్న వాహనాన్ని అపి తనిఖీ చేయగా అందులో 17.64లీటర్లు మద్యం సీసాలు ఉండగా దాని విలువ సుమారు 20000 ఉంటుందని అన్నారు. దింతో కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ రవీందర్ తెలిపారు.