నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఐఎల్‌పీఏ) జాతీయ మూడో సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. శనివారం మీడియాతో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొన్నం దేవరాజ్‌గౌడ్, జాతీయ కార్యదర్శి విజరు డానియల్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం పది నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఈ సమావేశాలు జరుగుతాయని వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డి హాజరవుతారని అన్నారు. గ్రామీణ న్యాయవాదులు చట్టాలపై ఆంగ్లంలో పట్టు సాధించడం ఎలా అనే అంశంపై శిక్షణా కార్యక్రమాలుంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మల్లెల భాస్కర్, పి మల్లేష్, మోషే మార్పు, గంగెయుడు, డేవిడ్, లక్ష్మిదేవి, బిక్షపతి, కేరిత్‌కుమారి, యాదయ్య, హేమలత, లావణ్య, తులసి, రమణ తదితరులు పాల్గొన్నారు.