అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో శుక్రవారం సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాలోని ‘అదే నేను.. అసలు లేను..’ సాంగ్‌ని లాంచ్ చేశారు. ఈ పాటలో అల్లరి నరేష్, అమత అయ్యర్ మధ్య బాండింగ్‌ని అందంగా ప్రజెంట్ చేసే మెలోడీగా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేశారు. అమత అయ్యర్‌తో చేసే సోల్‌ఫుల్ జర్నీతో రగ్గడ్‌గా ఉండే అల్లరి నరేష్ క్యారెక్టర్‌లో వచ్చే మార్పును సాంగ్‌లో చాలా బ్యూటీఫుల్‌గా ప్రజెంట్ చేశారు. కష్ణకాంత్ లిరిక్స్ లీడ్ పెయిర్ ఎమోషనల్ జర్నీని పొయిటిక్‌గా ప్రజెంట్ చేశాయి. ఎస్‌పి చరణ్, రమ్య బెహరా ప్లజెంట్ వాయిస్ మెలోడీని బ్యూటీఫుల్‌గా కంప్లీట్ చేసింది అని చిత్ర యూనిట్ పేర్కొంది. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం – సుబ్బు మంగదేవి, నిర్మాతలు – రాజేష్ దండా, బాలాజీ గుత్తా, స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు, అడిషినల్ స్క్రీన్ ప్లే: విశ్వనేత్ర, సంగీతం- విశాల్ చంద్రశేఖర్, డీవోపీ- రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్- బ్రహ్మ కడలి.