ఉత్తమ అవార్డు అందుకున్న ఐఎంఏ సెక్రెటరీ

IMA Secretary who received the best awardనవతెలంగాణ – ఆర్మూర్ 
తెలంగాణ రాష్ట్ర వార్షిక అవార్డు ప్రదాన కార్యక్రమంలో భాగంగా ఐఎంఏ బ్రాంచి సెక్రటరీ డా.భాను రామగిరి అవార్డును ఇటీవల అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ బాలు మాట్లాడుతూ నేషనల్  ఐఎంఏ ప్రెసిడెంట్ డా. దిలీప్ భానుశాలి, తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ డా.కాలి ప్రసాద్ చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రముఖ వైద్యులు  పాల్గొన్నట్టు తెలిపారు. ఆర్మూర్ బ్రాంచ్ కి దక్కిన గౌరవానికి పలువురు వైద్యులు ఐఎంఏ అధ్యక్షులు  రిషిత్ హాస్పిటల్ వైద్యులు వెంకట్ గౌడ్,, ఆశ హాస్పిటల్ వైద్యులు చంద్రశేఖర్ రెడ్డి  తదితరులు అభినందనలు తెలిపారు.