హైదరాబాద్ : పభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఒబిఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తనఖా హామీ ఆధారిత గృహ రుణాలు అందించే ఇండియా మార్ట్‌గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఐఎంజిసి) తెలిపింది. దీంతో సరసమైన గృహాల విభాగంలో జీతం, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రుణ మద్దతుపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. దేశంలోని 5,100 శాఖలు కలిగిన బిఒఐ విస్తృత శ్రేణీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనున్నట్లు పేర్కొంది. రుణగ్రహీతలకు మరింత అనుకూలమైన రుణ నిబంధనలను అందించడానికి వీలు కల్పిస్తున్నామని ఐఎంజిసి ఎండి, సిఇఒ మహేష్ మిశ్రా పేర్కొన్నారు. రాబోయే నెలల్లో ఈ భాగస్వామ్యం మరింత బలపడనుందన్నారు.