నిధుల దుర్వినియోగంపై తక్షణ చర్యలు చేపట్టాలి

కలెక్టర్‌ తీసుకున్న చర్యలు మిగతా వారికి గుణ పాఠం కావాలి
 బీజేపీ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు విక్రం రెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్‌ కలెక్టరేట్‌
గ్రామ పంచాయతీ లో నిధుల దుర్విని యోగం చేసిన సర్పంచ్‌ ను, సహకరించిన వారి పై తక్షణ చర్యలు చేపట్టా లని బీజేపీ మేడ్చల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రం రెడ్డి అన్నారు. కీసర మండ లం, కీసర గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై గ్రామ సర్పంచ్‌, సహకరించిన బాద్యులపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా రూరల్‌ ప్రధాన కార్యదర్శి జిల్లాల తిరుమల్‌ రెడ్డి,కీసర మండల అధ్యక్షుడు దేశం మల్లేష్‌ గౌడ్‌లతో కలిసి జిల్లా కలెక్టర్‌ అమోరు కుమార్‌,అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్యలకు వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా విక్రం రెడ్డి మాట్లాడుతూ. జిల్లాలోని కీసర గ్రామ పంచాయతీ లో జరిగిన నిధుల అవకతవకల పై సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన నివేదిక ఆధారంగా బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి చేసిన ఫిర్యాదుతో,జిల్లా అధికారులు జరిపిన తనిఖిలో నిధుల దుర్వినియోగంపై ఇచ్చిన నివేదిక ను అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరామన్నారు .అలాగే భాద్యులపై చర్యలు తీసుకోని కారణంగా ఫిర్యాదు దారులను ఏకంగా పంచాయతీ సభలో బహిరంగంగా బెదిరించే స్థాయికి వచ్చిందంటే ఏ స్థాయిలో ప్రజా ధనం దుర్విని యోగం జరుగుతుందో అర్థం మవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పంచాయతీ లలో,మున్సిపాలిటీలలో ఎన్నో పిర్యాదు వస్తున్నాయని,వాటిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటే మిగతా వారికి గుణపాఠం అవుతుందని అన్నారు. ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకట్‌ రెడ్డి, జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షులు కొలిచేలిమి కష్ణ,కీసర మండల ప్రధాన కార్యదర్శి కొల బాలరాజ్‌ యాదవ్‌,జిల్లా బీజెవైఎం ఉపాధ్యక్షులు నల్ల వెంకట్‌ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షలు బండారు శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.