– మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు
– 111 జీవోలో అక్రమ నిర్మాణాలకు
– అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణ
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీవో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ అధికారు లు పట్టించు పో కుండా ఉండడంలో అంతర్యం ఏమిటని టీపీసీసీ ఎస్సీ సెల్ సీనియర్ ఉపా ధ్యక్షులు జల్పల్లి నరేందర్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు కౌన్సిలర్ పీఎస్. సంజరు యాదవ్ ప్రశ్నించారు. శంషాబాద్‌లోని ధర్మగిరి రోడ్డులో సర్వేనెం బర్ 125/ ఆ2 అక్రమంగా నిర్మిస్తున్న సెలబ్రిటీ హౌమ్స్ వెంచర్ పై చర్య లు తీసుకోవాలని కోరుతూ వారు మున్సిపల్ కమిషనర్‌కు శనివారం వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు వత్తాసు పలుకుతు న్నారని పేర్కొన్నారు 111 జీవో వ్యతిరేకంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నా రు. అక్రమార్కులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా సెల్లార్లు తవ్వడం వెంచర్లు వేసి ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలన కాలం నుంచి శంషాబాద్‌లో విచ్చలవిడిగా వెంచర్లు వెలుతున్నాయన్నారు సెలబ్రిటీ హౌమ్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే ఈ విష యంపై కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.