నవతెలంగాణ – చండూరు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకుఇచ్చిన ప్రతి హామీని వెంటనేఅమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు భూమిలేని ప్రతి పేదవానికి, ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు, ఇండ్లునిర్మించి ఇవ్వాలనిఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామకమిటీలో అన్ని రాజకీయ పార్టీల ను అనుమతించాలని, సంక్షేమ పథకాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గ్రామాలలో పారదర్శకంగా అర్హులైన పేదలని గుర్తించాలనిఆయన కోరారు. అర్హులైన పేదలను గుర్తించకుండా ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంపిక చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని నిరుపేదలకి ఇండ్లు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి మహిళకు రూ.2500 ఇవ్వాలని, వ్యవసాయ కూలీల రూ.12 వేల, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ కకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయకుండా పెండింగ్లో ఉన్న రుణమాపిని వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు దపాలుగా ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ , రైతు భరోసా రాక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తక్షణమే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతూ సంపన్నులకు, బడా కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, గౌసియా బేగం, వెంకటేశం, నరసింహ, ఈరటి వెంకటయ్య, అంజయ్య,బల్లెం స్వామి, ఈరగట్ల నరసింహ,తదితరులు ఉన్నారు.