జన్నారంలో ఘనంగా వినాయక నిమజ్జనం..

Grand vinayaka immersion in Jannaram..నవతెలంగాణ – జన్నారం
మండల కేంద్రంతో సహా పలు గ్రామాల్లో తొమ్మిది రోజులుగా నిర్విఘ్నంగా పూజలు అందుకున్న వినాయకుడిని, ఆయా గ్రామాల్లో  మండప నిర్వాహకులు సోమవారం వినాయక నిమజ్జనం చేశారు.ముందుగా మండలంలోని చింతాగూడ గ్రామంలో మాజీ  వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని,మధ్యాహ్నం రెండు గంటలకే గోదావరిలో నిమజ్జనం చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘ నాయకులు ఏర్పాటు చేసిన మహాగణపతికి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు అలాగే, వినాయక నగర్లో ఏర్పాటు చేసిన గణపతి వద్ద మాజీ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్  బిజెపి మండలాధ్యక్షుడు మధుసూదనరావు, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు మున్వర్ అలీ ఖాన్, రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్, ఖడార్ల నరసయ్యను ప్రత్యేక పూజలు చేశారు. కిష్టాపూర్  గ్రామంలో హనుమాన్ వినాయకుని మండపం వద్ద   వాసాల నరేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పొనకల్  మేజర్ గ్రామపంచాయతీ పక్కనే ఏర్పాటుచేసిన, వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే తిమ్మాపూర్ గ్రామంలో ఆరు చోట్ల ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనం చేశారు. డోలు వాయిద్యాలతో భాజాబజంతరులతో శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనాన్ని పూర్తి చేశారు.  వినాయక నిమజ్జనాలకు ఆయా గ్రామాల్లో  అధికారులు వాగుల వద్ద గోదావరి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రాజ వర్ధన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో పోలీస్ నిఘా ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనాల కార్యక్రమాన్ని ముగింపు చేశారు.