
దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా వినాయక నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి యేటా వినాయకుడిని ఏర్పాటు చేసి భక్తి శ్రద్దలతో 11 రోజులు పూజలు చేశామని అన్నారు. చివరి రోజు గణనాధుడికి ప్రత్యేక పూజలు చేసి మండపం వద్ద డీజే పాటలకు నృత్యాలు, డ్యాన్సలు చేసి, గ్రామంలో శోభయాత్ర నిర్వహించి ఊరి చెరువులో నిమర్జనం చేశామని తెలిపారు.నిష్ఠతో స్వామి వారికీ పూజలు చేస్తే సకల శుభాలు జరుగుతాయని పేర్కొన్నారు. నిమజ్జనం వేడుకల్లో శివపుత్ర యూత్ సభ్యులు, కాలనీ వాసులు ఉన్నారు.