
వినాయక నిమజ్జోత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ఆయన స్థానిక యువజన సంఘాల అధ్యక్షులు వినాయక మండపాల నిర్వహకులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వినాయక నిమజ్జనాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, ఘర్షణ వాతావరణానికి చోటు ఇవ్వకుండా సంబరంగా జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డిని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆనంద్, గ్రామ అభివృద్ధి కమిటీ సదర్ లు చిన్నారెడ్డి, బుచ్చన్న, బందెల రాజు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామంలోని యువజన సంఘాల అధ్యక్షులు, వినాయక మండపాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.