కాంగ్రేస్ పార్టీలో వలసల జోరు

– బీఆర్ఎస్ ను వీడి కాంగ్రేస్ లోకి భారీగా చేరికలు
– బూరుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పలువురు చేరిక
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడపగల్ మండలంలోని  విట్ఠల్ వాడి గ్రామం విట్ఠల్ వాడి తాండ,పోచారం తాండ,శివపూర్, బూరుగుపల్లి,గ్రామాలలో శుక్రవారం నాడు బీఆర్ఎస్ , బీజేపీ పార్టీల నుండి కాంగ్రేస్ పార్టీ లోకి మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మి కాంత్ రావు సమక్షంలో సుమారు 217మంది పార్టీ లోకి చేరారు.వీరికి పార్టీ ఖండవలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలోని  అన్ని గ్రామ ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలించినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. దింతో జుక్కల్ ప్రజల కోసం ఎల్లపుడు అందుబాటులో ఉండి ప్రజల కోసం  అభివృద్ధి పనులు చేసి పెద్ద కొడపగల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అంతే కాకుండా గత బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేదని ఆయన ఎద్దవా చేశారు.జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం184 గ్రామాలు ఉండాగా అందులో 167 గ్రామాలకు తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.దింతో వెంటనే ఆయా గ్రామాల ప్రజలకు తాగు నీటి సమస్య నుండి దూరం చెయ్యాలనే ఉద్దేశ్యంతో బోరు మోటారు వేయడం జరిగిందని సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు.బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కోలుకోలేని పరిస్థితి లో ఉందని ఎద్దవా చేశారు.అంతే కాకుండా బిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉందని ఇప్పుడు కేసీఆర్ కూతురుని కాపాడుకుంటాడా లేదా పార్లమెంట్ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసి  వారిని కాపాడుకుంటాడా దిక్కుతోచని స్థితిలో ఉన్నరని అన్నారు.లిక్కర్ కేసులో కవిత ఎంత తిన్నదో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం అయిందని ఆగ్రహ వ్యక్తం చేశారు. అంతేకాకుండా లిక్కర్ కేసులో  కవిత అక్రమ సంపాదనతో  భారత దేశంలో  తెలంగాణ రాష్టం ఇజ్జత్ పరువు పోయిందని హేళన చేశారు.ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రజల కోసం కాంగ్రేస్ పార్టీ ఎల్లపుడు కృషి చేస్తుందని రాబోయే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను మో అమూల్యమైన ఓటు వేసి భారీ మేజరితో గెలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి.మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, చిప్ప మోహన్,కల్లూరి పండరీ,జగిర్ నాయక్,కానా నాయక్ ,మష్ణాపాటిల్,రామా రావు,పాటిల్,శ్రీహరి,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.