అపుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు,ముర్రుపాలు పట్టించడం తో వారిలో నిరోధక శక్తి పెరుగుతుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ నాదెళ్ళ సౌజన్య పలువురి బాలింతలకు వివరించారు. శుక్రవారం మండలంలోని గుమ్మడవల్లి లో గల రెండో అంగన్వాడి కేంద్రంలో ఆరు నెలల బాబు కి అన్నప్రాశన నిర్వహించారు. అనంతరం అదనపు ఆహారం ఎలా ఇవ్వాలి,ఏ ఏ ఆహార పదార్ధాలు ఎలా తినిపించాలి అనే విషయాలను బాలింతలకు వివరించారు. అలాగే 3 వ త్రైమాసికంలో ఉన్న గర్భిణీ లకు తల్లిపాలు,ముర్రుపాలు ఆవశ్యకతను తెలిపారు.