మండలంలోని హాస కొత్తూర్ ఆరోగ్య ఉప కేంద్రంలో కొనసాగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని బుధవారం చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ సుప్రియ పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న వివిధ వ్యాక్సిన్ లను ఆమె పరిశీలించారు. అదేవిధంగా వ్యాక్సిన్ లను తేదీల వారీగా చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చేముందు వాటి నాణ్యత ఎక్స్ పైరీ తేదీలను తప్పకుండా చూడాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. టీకాలు ఇచ్చిన తర్వాత పిల్లలను ఒక 30 నిమిషాలు ఆరోగ్య ఉపకేంద్రంలోనే పర్యవేక్షణలో ఉంచాలని ఆమె ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు తెలిపారు. పిల్లలకు నెలవారీగా తప్పకుండా టీకాలు ఇవ్వాలని, అదేవిధంగా తల్లిపాలు ప్రాముఖ్యతను వారికి బోధించాలని సిబ్బందికి సూచించారు. పిల్లల విషయంలో ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు వివరించారు. అనంతరం రికార్డులను, ఆన్ లైన్ రిపోర్టులను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక ఏఎన్ఎం మమత, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.