జిల్లాలో వ్యాధి నిరోధక టీకా స్పెషల్ డ్రైవ్..

– గాలికుంటు వ్యాధితో రైతులు అప్రమత్తంగా ఉండాలి.
– 63 బృందాలు,జిల్లాలో 2.29 లక్షల జీవాలు..
– కోల్డ్ స్టోరేజీలో టీకా డోస్ల నిలువ..
– ఉచిత టీకాను సద్వినియోగం చేసుకోవాలి.
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
గేదెలు, తెల్లజాతి పశువులు, గొర్రెలు, మేకల యజమానులు గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. మూడు నెలలలోపు,చూడి పశువులు మినహా మిగిలిన వాటన్నింటికి గ్రామాల వారీగా వెళ్లి టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమం కొనసాగుతుంది. ఈ వైరస్ ఎండాకాలంలో 14 రోజుల వరకు, చలికాలంలో నాలుగు వారాల వరకు జీవిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువుల నుంచి ఇతర పశువులకు గాలి ద్వారా, పశువుల పాకలో ఉపయోగించే పరికరాల కూడా వ్యాప్తి చెందుతుంది.వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమతో ఆర్థికంగా బలపడుతున్న రైతులు నష్ట పోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయిస్తున్నారు. జిల్లాలో ఈ నెల15వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ టీకాలను అందుబాటులో ఉంచి వేస్తున్నారు.జిల్లాలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ముమ్మరంగా సాగు తోంది.జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఏ. కుమారస్వామి ఆధ్వర్యంలో తెల్ల, నల్ల జాతి పశు వులకు (ఆవులు, గేదెలు) వైద్యులు, వైద్య సిబ్బంది కలిసి టీకాలు వేస్తున్నారు.గ్రామాల్లో ముందస్తు టమక వేస్తూ రైతులను అప్రమత్తం అయ్యేలా చేస్తున్నారు. మండలాల వారీగా పశువుల సంఖ్యను లెక్క వేసిన పశు సంవర్ధక శాఖ అధికారులు.అందుకు తగ్గట్టుగా బృందాలను ఏర్పాటు చేశారు. 2.29 లక్షల టీకా డోస్లు జిల్లాకు చేరుకోగా, కోల్డ్ స్టోరేజీలో భద్ర పరిచారు. గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి చల్లదనాన్ని బట్టి ఉదయం 11 గంటల వరకు పశువులకు టీకాలు వేస్తున్నారు. పశువులు ఉన్న ప్రతి రైతు ఉచిత టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వ్యాధి సోకిన పశువుల నుంచి ఇతర పశువులకు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.కనుక రైతులు గమనించవలసింది.రైతు వద్ద ఉన్న ప్రతి పశువుకి ట్యాగు ఉండేలా చూసుకోవాలి.పశువుకి ట్యాగ్ లేకుంటే ప్రభుత్వం తరఫునుంచి వచ్చే సదుపాయాలను రైతు పొందలేరు.
గాలికుంటు వ్యాధి లక్షణాలు..
గాలికుంటు వ్యాధి సూక్ష్మాతిసూక్ష్మ క్రిముల (వైరస్) వల్ల వస్తుంది. 24 గంటల్లోగా చిక్కిపోయి అల్సర్కు గురవుతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదాలు, నాలుక, చన్నులతో పాటు కాళ్ల గిట్టల మధ్య పుండ్లు వచ్చి అనతికాలంలోనే ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఈ వ్యాధి సోకిన పశువులు ఎప్పుడూ ముడుచుకుని పడుకుంటాయి. మేత, నీళ్లు సరిగా తీసుకోలేవు. నెమరు వేయలేవు. నోటి నుంచి సొంగ లేక నురగ కారుతుండటంతో పాటు బరువు తగ్గిపోతాయి. కాళ్ల మధ్యన పుండ్లు పడడం వలన సరిగ్గా నడవలేవు. పాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి తగ్గి కొన్నిసార్లు పశువులు (ఎక్కువగా దూడలు) చనిపోయే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన దూడలు 30 నుంచి 40 శాతం చనిపోతుంటాయి. మందుస్తు నివారణలో భాగంగా టీకాలు వేయించుకోవడమే ఉత్తమం. వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం వలన దూడలు చనిపోతాయి.
టీకాతో వ్యాధి నివారణ..
నోరు,పెదాలు,నాలుక, చన్నులు, కాళ్ల గిట్టల వద వచ్చిన పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ లేదా నార్మల్ సైలెన్ నీటితో పరిశుభ్రంగా కడగాలి. కాళ్ల గిట్టల మధ్య పుండ్లను నీటితో కడిగిన తర్వాత ఆరనిచ్చి యాంటీ సెప్టిక్ లోషన్ను రాసి అవసరమైతే ఈగలు వాలకుండా నివారించడానికి కట్టు కట్టించాలి. రెండవసారి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి యాంటి బయోటిక్స్ మందులు, పశువులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బి కాంప్లెక్స్ మందులను వాడాలి. వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించాలి. నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టల వద్ద ఉన్న పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ లేదా నార్మల్ సెలైన్ వాటర్తో శుభ్రం చేయాలి. రెండోసారి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడా నికి యాంటీ బయాటిక్స్ మందులు, పశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బీ కాంప్లెక్స్ మందులను వాడాలి.
సకాలంలో టీకాలు వేయించాలి…
జీవాల యజమానులు గాలికుంటు వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యశాఖ అధికారులు చెప్పిన సమయంలో తప్పనిసరిగా టీకాలు వేయించాలి. సంవత్సరంలో రెండుసార్లు టీకాలు వేయించటం వలన వ్యాధి సోకే ప్రమాదం ఉండదు. గాలికుంటు వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి కావడం వలన నిర్లక్ష్యం చేస్తే పశువులు మరణించే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు యజమానులువ వాటి ఆరోగ్య పరిరక్షణ చూసుకుంటూ ఉండాలి.
వ్యాధి సోకిన పశువులు ఒకే చోట ఉంచరాదు..
గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర మూగ జీవితాలతో కలిసి ఒకే చోట ఉంచకూడదు. ఎప్పటికప్పుడు పశువుల పాకను శుభ్రంగా ఉండాలి. వారానికి ఒకసారి కొట్టంలో సున్నం చల్లి, క్రిమికీ టకాల నివారణకు చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాతనే తాగాలి. వ్యాధి సోకి పశువు చనిపోతే దానిని గుంత తోమి అందులో వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలి.
పాటించావల్సిన జాగ్రత్తలు…
గాలికుంటు వ్యాధి సోకిన పశువులను మందలో ఉంచకుండా వేరేగా కట్టేయాలి. పశువుల పాకను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు నీరు చల్లి వారానికి ఒకసారి సున్నం చల్లిస్తుండాలి. వ్యాధి సోకిన పశువులకు వాడిన పరికరాలను పాకలో ఉంచకుండా దూరంగా పడేయాలి. పాకలో ఉంచడం వలన ఈ వ్యాధి ఇతర పశువులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జబ్బు చేసిన పశువు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసుకుని తాగాలి. పశువులను మేతకు తోలుకెళ్లినప్పుడు అక్కడ కుంటలలో నిల్వ ఉన్న నీటిని తాగకుండా జాగ్రత్త వహించాలి.వ్యాధి సోకి పశువు చనిపోతే దానిని గోతిలో వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలి. చల్లని తాగునీరు పశువులకు అందించడం వలన పాల దిగుబడి బాగా ఉండటంతో పాటు పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు.
జిల్లాలో పశువులు, సిబ్బంది సంఖ్య..
తెల్లజాతి పశువులు=54,093.
నల్లజాతి పశువులు=1,89,436.
బృందాలు=63..
డాక్టర్లు 35.
ప్యారా సిబ్బంది=70.
గోపాలమిత్ర సిబ్బంది=80.
పశు మిత్ర సిబ్బంది=20 మంది సహకారంతో టీకా వేస్తున్నారు.
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి..
డీవీఏ హెచ్ ఓ ఏ.కుమారస్వామి..
పశువుల్లో సోకే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను ప్రతి రైతు వేయించాలి. వ్యాధి సోకకుండా ముందస్తుగా వేసే ఉచిత టీకాలు వేయించడంతో పాటు అప్పటికే వ్యాధితో బాధపడుతున్న వాటిని వెంటనే వెటర్నేటి దవకనికి తీసుకెళ్లి చికిత్స మొదలుపెట్టాలి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు టీకా కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామాల
వారీగా టీకాలు వేసే సమయంలో ఒక్కరోజు ముందుగానే టమక వేయిస్తున్నాం.