చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు..

Immunizations for childrenనవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్‌లో శనివారం చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ రాజమణి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని, వైద్యుల సూచనలు పాటించి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శ్యామల, ఆశా వర్కర్లు, తదితరులు ఉన్నారు.