ఎఐతో ఐటిలో 70% ఉద్యోగాలపై ప్రభావం

ఎఐతో ఐటిలో 70% ఉద్యోగాలపై ప్రభావం– హెచ్‌సిఎల్‌ మాజీ బాస్‌ హెచ్చరిక
న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఎఐ)తో ఐటి పరిశ్రమలో ఉద్యోగాలకు ప్రమాదం నెలకొందని హెచ్‌సిఎల్‌ మాజీ సిఇఒ వినీత్‌ నాయర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎఐ టూల్స్‌తో 70 శాతం ఉద్యోగాలు తగ్గొచ్చని ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు. ఆటోమేషన్‌తో భారీ మొత్తంలో ఉద్వాసనలు ఉండనున్నాయని హెచ్చరించారు. ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకునే బదులు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచాలన్నారు. ఐటి ఉద్యోగులు చేపట్టే కోడింగ్‌, టెస్టింగ్‌, మెయింటెనెన్స్‌, ట్రబుల్‌ టికెట్స్‌ రెస్పాండింగ్‌ స్కిల్స్‌ను ఎఐ చేపట్టడంతో ఆయా విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పోవచ్చన్నారు.