పొంచివున్న ప్రమాదం..

నవతెలంగాణ-లోకేశ్వరం : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఓ విద్యుత్ స్తంభం శిథిలమై, మరో విద్యుత్ స్థంభం ఒరిగి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డ్రైనేజీ పనులు చేసే సమయంలో అధికారులు విద్యుత్ స్తంభం మారుస్తామని చెప్పినా ఇప్పటివరకు స్తంభాన్ని మార్చలేదని వారు మండిపడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.