ముదిరాజుల హామీలు అమలు చేయండి

Implement Mudiraju's promises– ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్
– మండల కేంద్రంలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
– ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు
నవతెలంగాణ – తాడ్వాయి 
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షులు బొల్లు దేవేందర్ కోరారు. గురువారం మండల కేంద్రంలో ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం, ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా ముదిరాజ్ మహాసభ జెండా ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షులు బొల్లు దేవేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అభయహస్తం అనే హామీ ఇచ్చారని, కుల గణన సక్రమంగా చేపట్టడంతో పాటు 42 శాతం రిజర్వేషన్లలో ముదిరాజుల వాటా జనాభాకు అనుగుణంగా ఇవ్వాలన్నారు. జీవో నెంబర్ 15 ప్రకారం ముదిరాజులను “బిసి, డి” నుంచి, “బిసి, ఏ” లోకి మార్చాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ కు 1000 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. అలాగే తెలంగాణ మత్స్య శాఖ ఫెడరేషన్ వెంటనే ఎన్నికలు జరిపి చైర్మన్, పాలక మండలిని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు పిట్టల సారయ్య, సాదు చక్రపాణి, తాడ్వాయి మండల అధ్యక్షులు రంగరబోయిన జగదీశ్, రేసు సురేష్, మట్టుపల్లి రతన్, పిట్టల బుజ్జన్న, పిట్టల సారయ్య, పాండవుల సమ్మయ్య,  పాండవుల సాయి , మట్టుపల్లి నరేష్, డ్యాగల కిరణ్, కళ్ళెబోయిన రాజన్న, కళ్ళెబోయిన రవి, మల్లబోయిన సతీష్, గొర్రె మహేందర్, పిట్టల సాయి కిరణ్, ఉపేందర్, రవీందర్, గువ్వా సుబ్బారావు, ఎలా సదానందం, ఎలా శ్రీను, సాంబయ్య, సురేష్, నీలం రాములు, సంపత్, బర్ల సంపత్, ముదిరాజ్ మహాసభ నాయకులు తదితరులు పాల్గొన్నారు.