ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు 

పొన్నం– త్వరలోనే 150 పడకల ఆసుపత్రి
– సన్న వడ్లకు బోనస్ ఇస్తామన్న.. రైతుల ఖాతాలో వేస్తున్నాం 
– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుందని, తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన తరువాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ లో ని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పై పాటలు,నృత్యాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ ఇంటికి వచ్చి గ్యారంటీ కార్డ్స్ ఇచ్చాము అవన్నీ అమలు చేస్తామన్నారు. మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది .మీ అశ్వర్వడంతో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి గా అయ్యాననీ తెలిపారు. ఏడాది కాలంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికి  కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పం..రైతుల ఖాతాలో బోనస్ పడుతుందన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ పూర్తైందనీ, రుణమాఫీ కానీ వారి కుటుంబ నిర్ధారణ జరుగుతుందన్నారు.10 ఏళ్లలో గురుకుల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని 40 శాతం డైట్ , కాస్మొటిక్ చార్జీలు పెంచామన్నారు. కుర్చీ వేసుకుని గౌరవెళ్లి ప్రాజెక్టు కడతమని కట్టలేదన్నారు. ఇప్పుడు కాలువల నిర్మాణం కోసం రూ. 433 కోట్లు కేటాయించి, కాలువల నిర్మాణం కోసం మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో భూ సేకరణ జరుగుతుందన్నారు. పారిశ్రామిక కారిడార్ తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.  త్వరలోనే 150 పడకల ఆసుపత్రి కి శంఖు స్థాపన జరుగుతుందన్నారు. హుస్నాబాద్ నుండి కరీంనగర్, హుస్నాబాద్ జనగాం వెళ్ళే రోడ్ల విస్తరణ జరుగుతుందన్నారు.ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి సెట్విన్ కేంద్రాన్ని తెచ్చామన్నారు. కంప్యూటర్ ,బ్యూటిఫికేశన్ , మోటార్ రిపేర్ తదితర శిక్షణ ఇస్తున్నామని అందరూ ఉపయోగించుకోవలన్నారు.సమగ్ర కుల గణన సర్వే జరుగుతుందని, అందరూ సమాచారం ఇవ్వలాన్నారు.ఎవరికేంతో వారికి అంత అనేలా మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం మన్ చౌదరి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిసిటీ శివయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.