నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామంలోని గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్వేత సమక్షంలో ప్రజా పాలన గ్రామ సభ సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ తల్లి సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వగా, అట్టి రాష్ట్రాన్ని పదేండ్లు రాబందుల్లా ప్రజా ధనాన్ని దోచుకుని, దొరల అహంకారపూరిత చర్యలు తీసుకుంటూ సచివాలయంలోకి సామాన్య ప్రజలను రాకుండా చుట్టూ కంచె వేసుకుని పాలిస్తున్న నైజాం పాలనను గద్దె దించి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం ఎదురుగా ఉన్న కంచెను తొలగించి ప్రజా పాలనను తెలంగాణ రాష్ట్రంలో తెర లేపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అన్నారు. అప్పటి నుండి ప్రజా పాలనలో ప్రజలందరినీ భాగస్వాములు చేసి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకం నిజమైన అర్హులకు చేరాలని ఇంటింటి సర్వే నిర్వహించారు అని అన్నారు. కులలన్నిటికి జనాభా దామాషా ప్రకారం సమంగా పథకాలు అందేలా కుల ఘనన నిర్వహించిన మొట్ట మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 9 తల్లి సోనియమ్మ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. అలాగే గత సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భముగా దేశంలోనే ఏ పార్టీ చేయని రైతు పంట రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తూ దేశానికే దిక్సూచిగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఇప్పటికే 53000 ఉద్యోగాలు భర్తీ చేశాయి అని అన్నారు. ఇంకా గ్రూప్స్, మెడికల్ సంబంధిత ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇంకా ఇరవై వేల ఉద్యోగాలు వచ్చే నెల వరకు భర్తీ చేసే అవకాశం ఉందని, బి.ఆర్.ఎస్. పార్టీ గత పదేండ్ల పాలనలో లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, ప్రజా సంక్షేమాలతో దేశంలోనే సుపరిపాలన అందిస్తున్న ఏకైక పార్టీ అని అన్నారు. అలాగే వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్బంగా నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులకు పెట్టుబడి సహాయం కోసం ఏడాదికి ఎకరానికి 12000/- రూపాయలు అందిస్తూ రైతు భరోసా, మొట్ట మొదటి సారి భూమిలేని నిరుపేదలకు కూడా ఏడాదికి 12000/- రూపాయలు అందిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు పంపిణీ, అలాగే ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతున్నాయని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అలాగే ఎవరైనా ప్రజా పాలన దరఖాస్తు ఇచ్చిన కూడా పేరు రాకుంటే మళ్ళీ వారికి ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తు చేసుకోవడానికి ఒక రోజును కేటాయిస్తుందని ఎవరు ఆందోళన పడాల్సిన వకూడా అవసరం లేదని అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం వస్తుంది అని అన్నారు. పందేండ్లు బి.ఆర్.ఎస్.పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని అన్నారు. మండలంలోని పసర గ్రామం మండలంలోనే అత్యధిక జనాభా కలిగిన గ్రామం అని, ప్రజా పాలన గ్రామ సభ చాలా ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు, సంయమనం పాటించి శ్రద్ధగా అధికారులు చెప్పిన ప్రతి మాటను అవగాహన చేసుకుని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల, గ్రామ సంబంధిత అధికారులు, మండల మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.