
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వాటిలో ఒకటైన గృహ జ్యోతి పథకం అమలు చేసి ప్రజలకు ఉచిత కరెంటు పథకం అమలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని హామీలు నెరవేరుస్తూ ప్రజా సంక్షేమం అమలుపరుస్తుందని ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు బస్వంత్ పటేల్ సాంగు పటేల్ హనుమంతరావు దేశాయ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చడం గృహ జ్యోతి వినియోగదారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అభినందిస్తున్నారు.