
నవతెలంగాణ – వేములవాడ
సిరిసిల్ల పట్టణం చంద్రంపేట కు చెందిన పాతురి రమణారెడ్డి అనే వ్యక్తి రిపోర్టర్ గా పని చేస్తు భూ సమస్యల్లో,ఇతర సమస్యల్లో తలదురుస్తూ, అధిక మొత్తంలో డబ్బులు వసూలుకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తూన్న రమణారెడ్డి పై పోలీసులు పి.డి యాక్ట్ చేశారు. సిరిసిల్ల, తంగాలపల్లి, కొనరావుపేట్, వేములవాడ పోలీస్ స్టేషన్ల లో 10 కేసులు నమోదు కాగా రమణారెడ్డి కార్యకలపలను మార్చుకొనప్పటికీ రమణారెడ్డి మీద రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పి.డి యాక్ట్ అమలు చేయడానికి ఉత్తర్వులు వెలువడ్డాయి.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ పోలీసులు పాతురి రమణారెడ్డి పై పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి గురువారం రోజున నిందుతున్నీ చర్లపల్లి జైలు కు తరలించినట్టు వెల్లడించారు.