మరికల్: సోమవారం నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మరికల్ పట్టణంలో 8 బూత్‌లు ఉండగా ఎన్నికల సిబ్బంది వారి వారి బూత్‌లలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మరికల్ పట్టణంలో 241 బూత్ నుంచి 249 వరకు ఉండగా మొత్తం ఓట్లు 8365 ఓటర్లు ఉన్నారు. మరికల్ మండలంలో 17 గ్రామాలు ఉండగా మొత్తం ఓటర్లు 32,666 ఉన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఈ ప్రజలు, ఓటర్లు గమనించాలని ఎన్నికల అధికారులు తెలిపారు.