ప్రజా పాలనతోనే ఆరు గ్యారెంటీల అమలు

– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-తొగుట:
ఆరు గ్యారంటీల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావు పేట, పెద్ద మసాన్ పల్లి గ్రామాలలో ఆరు గ్యారెంటీ పథకాల అమలు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలతో బాగంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం అమలు చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందని అన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంబించిందని తెలిపారు. ప్రజా పాల నను కోరుకుని, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నం దుకు ప్రజలందరికీ అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్టుగానే, ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేశారని, ప్రభు త్వం కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడ బిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,అర్హు లైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వైద్య సాయంతో గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించిందన్నారు.ప్రతి గ్రామంలో ఉన్న పేదవారికి సైతం సంక్షేమ పథకాలు అందిన ప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజాపాలన ఉద్దేశ్యం నిస్సహాయులకు సాయం చేయటమేనని, స్వయంగా ప్రభుత్వమే లబ్దిదారు ల అందించేందుకు కృషి చేయాలన్నారు.

మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసు కోవాలని కోరారు.ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమయజ్ఞం లో భాగస్వాములవాలని కోరారు.పార్టీలకతీతంగా ప్రజలకు పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేసి ప్రజల ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి,ఎంపీటీ సిల పొరం అధ్యక్షుడు కంకణాల నర్సింలు, సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి, ఎంపీటిసి మష్టి సుమలత కనకయ్య, ఉప సర్పంచ్ రాజీ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రేపాక తిరుపతి ముదిరాజ్, యెన్నం భూపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అనిల్, సంతోష్, రాములు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.