
– అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
పసుపు రైతులకు క్వింటలకు పదిహేను వేయిల మద్దతు ధర ప్రకటించాలని మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అయన మండల కేంద్రంలో విలేకరుతో మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల కాల పోరాటాల ఫలితంగా పసుపుబోర్డు సాధించడం జరిగిందని.. సాధన ఉద్యమంలో రైతు నాయకుడు మనోహర్ రెడ్డి చెప్పులు ధరించకుండానే తిరుపతి వరకు పాదయాత్ర నిర్వహించడమే కాకుండా సుమారు 12 సంవత్సరాలు చెప్పులు వేసుకోలేదని ,అనేక రూపాల్లో ఉద్యమాలు జరిగాయని గుర్తు చేస్తూ,, స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నిజాంబాద్ వ్యవసాయ మార్కెట్లో ప్రతి సంవత్సరం వ్యాపార సిండికేట్ కృత్రిమంగా ధరలు తగ్గిస్తుందని అనేక ఆందోళన చేసిన వ్యాపారుల్లో మార్పు రావడంలేదని, సాంగ్లీ మార్కెట్తో పోలిస్తే నిజాంబాద్ మార్కెట్లో క్వింటాలకు రూ.4000 ధర తక్కువ పలుకుతుందని ఈ మాయ వ్యాపారులదే అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పై పసుపు బోర్డుఅధ్యక్షుడు. పల్లె గంగారెడ్డి ఒత్తిడి తెచ్చి 15 వేల రూపాయలు క్వింటాల్ ధర నిర్ణయించే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపుకు వెయ్యి రూపాయలు క్వింటాలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు సాధన కొరకు జరిగిన ఉద్యమంలో ఆర్మూర్ డివిజన్ ప్రాంత మహిళా రైతులపై. రైతు నాయకులపై కేసులు నమోదయి నేటికీ కోర్టులచుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవారంటి యు సి ఐ . జిల్లా అధ్యక్షులు యం ముత్తన్న.పాల్గొన్నారు.