సంక్షేమ పధకాల అమలు నిరంతర ప్రక్రియ…

Implementation of welfare schemes is a continuous process...– సమన్వయం, సజావుగా గ్రామసభలు నిర్వహించాలి…
– ప్రతీ దరఖాస్తును స్వీకరించాలి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
సంక్షేమ పధకాల అమలు నిరంతర ప్రక్రియ అయినందున గ్రామ సభల్లో ఎవరు, ఎందుకోసం దరఖాస్తు చేసినా సిబ్బంది స్వీకరించాలని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ తెలిపారు. మంగళవారం నుండి నిర్వహించనున్న గ్రామసభల్లో పాల్గొనే సిబ్బందికి సోమవారం నిర్వహణ పై ఆయన దిశానిర్ధేశం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాబితాలోని అర్హులు దరఖాస్తు చేస్తే స్వీకరించి దాన్ని నమోదు చేయాలని, గ్రామ సభలో పాల్గొనే ప్రజలతో సమన్వయంతో వ్యవహరించి గ్రామసభలు సజావుగా జరిగేలా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు అడిగిన సందేహాలను ఓపికతో సిబ్బంది నివృత్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి హై,పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,ఎంపీ.ఈ.ఓ సోయం ప్రసాదరావు, ఉపాధి హిందీ పధకం ఏపీవో రామచంద్రరావు, వ్యవసాయ శాఖాధికారి శివరాం ప్రసాద్ లు పాల్గొన్నారు.