
మద్నూర్ మండల కేంద్రంలోని గాంధీచౌక్ లో గల న్యూ ఆదర్శ పాఠశాలలో గురువారం సాయంత్రం వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపురులను అమితంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. తక్కువ కాలంలో పాఠశాల విద్యార్థులు మంచి విద్యా నైపుణ్యంతో రానిస్తున్నారని, ఇటీవల అబాకస్ పరీక్షలో న్యూ ఆదర్శ పాఠశాల విద్యార్థి సాయి సంస్కృతి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించి జాతీయ పోటీలకు ఎన్నిక కావడం గర్వకారణమని కొనియాడారు. విద్యార్థులు తల్లిదండ్రులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మారేపల్లివార్ శ్రీకాంత్, వడ్డే నాందేవ్, యాజమాన్యం మధు వ్యాస్, ఉపాధ్యాయులు, పిల్లల తల్లితండ్రులను ఘనంగా సన్మానించారు.