ఆకట్టుకున్న సాధనాశూరుల విన్యాసాలు

నవతెలంగాణ – బాల్కొండ 
బాల్కొండ మండల కేంద్రంలో పోచమ్మ గల్లి మహాలక్ష్మి మందిరం వద్ద ఆదివారం సాధనా శూరుల విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు పలు విన్యాసాల ద్వారా గ్రామస్తులను అలరించారు. వ్యక్తులను తాళ్ళతో బంధించి సునయసనంగా విడిపించుకోవడం, టెంట్లో రాళ్లతో దేవత విగ్రహాలు ఆవిష్కరించడం, చీపురు పుల్లలపై కళాకారుడు కూర్చోవడం, వంటి ఎన్నో కళాత్మక కనికట్టు విద్యలతో గ్రామస్తులను అబ్బుర పరిచారు. అనంతరం పద్మశాలి సంఘ సభ్యులు కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బుస శ్రీనివాస్, గుండు నాగరాజ్, అందే వెంకట గిరి, అంబిక శివలింగం, కుందారపు శ్రీనివాస్, బుస రత్నాకర్, భరత్, కేదార్, శ్రీహరి, బొగ తిరుపతి, జక్కుల నరసయ్య, కుందారపు శివశంకర్ సoఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.