ఆకట్టుకున్న నెరల్ కుస్తీ పోటీలు

నవతెలంగాణ – గాంధారి 

గాంధారి మండలంలోని నేరల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీలు మండల ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. నేరల్ గ్రామంలో నిర్వహించే కుస్తీ పోటీలలో పాల్గొనడానికి మల్ల యోధులు జిల్లా నలు మూలల నుండే కాకుండా  కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుస్తీ పోటీలను ఆకట్టుకునేలా చేశారు. 100 నుండి మొదలుకొని 1000 కుస్తీ పోటీలు నిర్వహించారు. చివరగా 3 తులాల వెండి, కడెం కుస్తీ నిర్వహించారు. సుమారు రూ.40000 రూపాయల వరకు కుస్తీపోటీలు నిర్వహించారు. వికలాంగ మల్లయోధుడు కుస్తీ పోటీలో పాల్గొని గెలుపొందారు. ఈ కుస్తీ పోటీలు అందరిని ఆకట్టుకున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మల్ల యోధులు పాల్గొన్నారు.