నవతెలంగాణ – బాల్కొండ: మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హైమావతి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థినులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని సాయి ప్రియ నేతృత్వంలో బ్యాండ్ పార్టీ టీమ్ విద్యార్థినులు చేసిన ప్రత్యేక ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమమలో ప్రిన్సిపాల్ డి. హైమావతి,ఉపాధ్యాయునిలు వి.జ్యోతి,వ్యాయామ ఉపాధ్యాయుని టి సాయి ప్రియ, స్టాఫ్ నర్స్ జే. శాలిని , విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.