– మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధిని ల పిరమిడ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్ట్ లో గల గిరిజన సంక్షేమ శాఖ మహిళా కళాశాల విద్యార్ధిని లు చే శుక్రవారం నిర్వహించిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ రోజ పర్యవేక్షణలో కళాశాల ఎన్.సి.సి క్యాడెట్ లు పావని,ప్రసన్న లు జాతీయ పతాకాన్ని చేబూని పలు చేసిన విన్యాసాలు ఆసక్తిగా ఉన్నాయి.విద్యార్ధినీ లు చే పిరమిడ్ ఏర్పాటు చేసి ఆశ్చర్యచకితులను చేసారు.వీరికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.