
ఇంట్లో కిరాయి ఉన్నట్టుగా నటిస్తూ నమ్మించి ఇంటి యజమానికి మత్తు మందు ఇచ్చి సొత్తు కాజేసిన నిందుతులకు సోమవారం జైలు శిక్ష , జరిమానా (భర్తకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా , బార్యకు 1 సంవత్సరం జైలు శిక్ష , జరిమానా) విధించినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ శిక్షలు తప్పవు అన్నారు. తేదీ 01.10.2018 నా ఫిర్యాదు అయిన కళ్యాణి ఇంద్రమ్మ వయసు 60 సంవత్సరాలు గ్రామం ఎల్లారెడ్డి నివాసరాలు. వృద్ధులైన ఇంద్రమ్మ, కళ్యాణి శంకరయ్య బార్యభర్తలు ఇద్దరు కలిసి వారి ఇంట్లో నివాసం వుంటున్నారు. తేదీ: 24.9.2018 రోజున బట్టలు అమ్ముకునే వ్యక్తులగా నటించి నిందితులు ఇద్దరూ భార్యాభర్తలు వచ్చి ఇల్లు కిరాయికి కావాలని చెప్పి కిరాయి వున్నారు. ఒక వారం రోజుల తర్వాత నమ్మించి రెండు బాటిల్ల కల్లు తీసుకొని వచ్చి రాత్రి ఒక మత్తు మందు కలిపిన బాటిల్ ఇంటి యజమనికి ఇచ్చి ఇంకో బాటిల్ తీసుకొని వెళ్ళినారు . ఇంటి యజమానులు భార్యాభర్తలు ఇద్దరు అట్టి కాల్లు తాగి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి ఇంటి యజమాని అయిన కళ్యాణి శంకరయ్య నోటి నుండి నురుగు కారుతు చనిపోయి వున్నాడు, ఇంటి యజమాని బార్య అయిన కళ్యాణి ఇంద్రాయమ్మ మెడలో పుస్తెలతాడు, కమ్మలు దొంగలించబడినవి, బీరువా పగులగొట్టి డబ్బులు తీసునిపోయినారు. కొత్తగా కిరాయి వచ్చిన బార్యబర్తలు ఇద్దరు కూడా కనిపించలేరు. వీరిపై అనుమానం వచ్చి మృతుని బార్య ఫిర్యాది మేరకు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగినది. ఈ దొంగతనం కేసు పరిశోధనలో భాగంగా గ్రామస్తులను, ఇతర గ్రామస్తులను విచారించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గుంటూరు జిల్లా కు చెందిన గుంజి వెంకటేశం అలియాస్ గణేష్, గుంజి దివ్య అలియాస్ లక్ష్మి నేరస్తునిగా గుర్తించి అరెస్టు చేయడం జరిగిందన్నారు.
కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి దొంగలించిన విషయం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సిహెచ్, వి ఆర్ ఆర్ వర ప్రసాద్ నిందుతునికి మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 4000 , రూపాయల జరిమానా, బార్య అయిన గుంజి దివ్య అలియాస్ లక్ష్మికి 1 సంవత్సరం జైలు శిక్ష మరియు 4000, రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగినదన్నారు.
ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి ఎల్లారెడ్డి సిఐ సుధాకర్, యస్ ఐ ఉపేందర్ రెడ్డి, ప్రసూత పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్ గౌడ్, కోర్టు లో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత సిఐ రవీంద్ర నాయక్, ప్రస్తుత ఎస్ఐ మహేష్ , కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ టి. మురళి, కోర్ట్ కానిస్టేబుల్ సాయిలు లను అభినందించడం జరిగిందన్నారు.