క్రేజీ కాంబినేషన్‌లో..

In a crazy combination..వరుణ్‌తేజ్‌, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈ భిన్న కలయికలో తెరకెక్కబోయే ప్రాజెక్ట్‌ను యువి క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా వరుణ్‌ తేజ్‌ నటించబోయే తన 15వ చిత్రానికి సంబంధించి మేకర్స్‌ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ అందరిలోనూ క్యూరియాసిటీని రైజ్‌ చేసింది. పోస్టర్‌ ఒక ప్రత్యేకమైన కొరియన్‌ కనెక్షన్‌ను చూపిస్తుంది, దీనిలో ఫైర్‌ డ్రాగన్‌ లోగోతో కూడిన జాడి, మంటలతో చుట్టు ముట్టబడి ఉంది. పోస్టర్‌ కొరియన్‌ టెక్స్ట్‌తో సీక్రెట్‌ని మరింత పెంచుతుంది. ‘వెన్‌ హంటింగ్‌ టర్న్స్‌ హిలేరిస్‌’ అనే ట్యాగ్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది – ప్రేక్షకుల కోసం ఎంటర్టైనింగ్‌ అడ్వంచరస్‌ జర్నీని సూచిస్తుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ థ్రిల్స్‌, హ్యుమర్‌ బ్లెండ్‌ చేస్తూ అద్భుతమైన స్క్రిప్ట్‌ను రాశారు. ఈ ఇండో-కొరియన్‌ హర్రర్‌ కామెడీ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ యూనిక్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడని పోస్టర్‌, ట్యాగ్‌లైన్‌ చెప్పకనే చెబుతోంది. ‘తొలి ప్రేమ’ వంటి భారీ విజయం తర్వాత, ఆయన మరోసారి సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. మార్చిలో ప్రొడక్షన్‌ ప్రారంభం కానుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలు మేకర్స్‌ త్వరలో తెలియజేస్తారు.