అమెరికాలో కేవలం జనవరిలోనే పదినెలల గరిష్టానికి ”లే ఆఫ్స్‌”

వాషింగ్టన్‌: అమెరికాలో జనవరి నెలలో ఉద్యోగుల తొలగింపులు రెండింతల కన్నా అధికమయ్యాయి. ఉద్యోగాల్లో కోతలు కేవలం జనవరిలోనే పదినెలల గరిష్టానికి చేరాయి. 2024 జనవరి నెలలో 82,307మంది ఉద్యోగులను తొలగించారు. డిసెంబర్‌లోని 34,817 మందితో పోలిస్తే 136 శాతం పెరిగాయని ఛాలెంజర్‌, గ్రే అండ్‌ క్రిస్మస్‌ అవుట్‌ ప్లేస్‌మెంట్‌ సంస్థ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.వార్షిక ప్రాతిపదికన చూసినట్లైతే, ఉద్యోగ కోతలు గతేడాది జనవరి నుండి 20శాతం తగ్గాయి. ఆర్థికరంగంలో 23,238 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా, ఇది అంతకుముందు సంవత్సరం కంటే రెండింతలు అధికంగా వుంది.నిర్వహణ ఖర్చుల తగ్గింపులు, యాంత్రికీకరణ, కృత్రిమ మేథస్సు (ఎఐ) వంటి చర్యలతో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఛాలెంజర్‌, గ్రే అండ్‌ క్రిస్మస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆండ్రూ చాలెంజర్‌ తెలిపారు.