అంగన్ వాడీల్లో మూడో తరగతి వరకు సమంజసం కాదు

– ప్రాథమిక పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలి
– సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఆహ్వానిస్తున్నాం: టిఎస్ యుటిఎఫ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అంగన్ వాడీలను ప్లేస్కూల్స్ గా మార్చి మూడవతరగతి వరకు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదన సరైంది కాదని, విరమించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు పెరుమాళ్ళ వెంకటేశం లు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అంగన్ వాడీలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా తల్లిదండ్రులు గుర్తించటం లేదని కనుక 1,2,3 తరగతులను అంగన్ వాడీలకు అప్పగించటం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మూసివేతకే దోహదపడుతుందని టిఎస్ యుటిఎఫ్ అభిప్రాయపడుతున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని  డిమాండ్ చేశారు.ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ గా మార్చాలనే ప్రతిపాదన ఆహ్వానించతగినదని, ఎంపిక చేసిన పాఠశాలల్లో తరగతికొక టీచరు, సబ్జక్టుకొక టీచరు, ప్రధానోపాధ్యాయులు, తగినంత బోధనేతర సిబ్బంది పాఠశాలలో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.