నవతెలంగాణ-గోవిందరావుపేట: మండలం లోని బాలాజీ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మాలోత్ గాంధీ మరియు మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు, గడపగడపకు వెళ్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి వివరిస్తూ సీఎం కేసీఆర్ గారు విడుదల చేసిన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని బడే నాగజ్యోతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు , రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు దళిత బంధు గృహలక్ష్మి పథకాలు నిరాటం కంగా కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ మల్లేష్ మండల ఉపాధ్యక్షులు ఏ బిక్కు పి స్వామి గణేష్ లాల్ బి మీటు ఏ లక్ష్మణ్ టి హరి సింగ్ బి మీటు బి దేవ్ ఈ రవి గ్రామ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కారు గుర్తుకే ఓటు వేయమని అభ్యర్థులను అభ్యర్థించారు