
మద్నూర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం నాడు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మార్కెట్ కమిటీ ఇన్చార్జి సెక్రటరీ సత్యం సార్ జాతీయ జెండాను ఎగరవేశారు. స్వతంత్ర వేడుకలకు మార్కెట్ కమిటీ పరిధిలోని పత్తి మిల్లుల ట్రేడర్స్ గుమస్తాలు కమిషన్ ఏజెంట్లు హమాలీలు కార్యాలయ సిబ్బంది పాల్గొనగా.. మార్కెట్ కమిటీ తరఫున ఇంచార్జ్ సెక్రెటరీ స్వీట్లు పంపిణీ చేశారు.