మైసిగండి ఆలయ అభివృద్ధిలో మండల ప్రజలను భాగస్వాములు చేయాలి 

– కడ్తాల్ మండల నాయకులు సబావత్ బిచ్యా నాయక్ 
నవతెలంగాణ-ఆమనగల్ 
కల్వకుర్తి నియోజకవర్గంలో అతి పెద్దదైన మైసిగండి మైసమ్మ ఆలయం నూతన కమిటీని ఏర్పాటు చేసి మండల ప్రజలకు అందులో భాగస్వామ్యం కల్పించాలని మండల నాయకులు సబావత్ బిచ్యా నాయక్ అన్నారు. బుధవారం కడ్తాల్ మండల కేంద్రములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల నాయకులు, మైసమ్మ అమ్మవారి భక్తులతో కలసి ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోనే అత్యంత వైభవంగా జరిగే మైసమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు పూర్తయిందని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల మాదిరిగా మైసిగండి దేవాలయ నూతన కమిటీని ఏర్పాటు చేయాలని అందులో మైసిగండి ప్రజలతో పాటు మండల ప్రజలకు కూడా ఆలయ కమిటీలో అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, నాయకులు పిప్పల యాదయ్య, సత్యం యాదవ్, సిద్దిగారి దాసు, ఎర్రోళ్ల శ్రీకాంత్, రాజేందర్ గౌడ్, కే.రమేష్, నరేష్ నాయక్, జంగయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.