హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందు

– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
రాష్ట్రంలో రైతాంగానికి రూ.31 వేల కోట్లతో రైతుల రుణమాఫీ జరుగుతుందని హామీల నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని మండలం బచ్చోడు హస్నాబాద్‌ లక్ష్మీదేవికి పల్లి తండా సుబ్లేడు మేడిపల్లి ఆయా గ్రామంలో పర్యటించిన ఆయన 40 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ చెక్కులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ కోసం అన్ని సమకూరుస్తున్నామన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో వచ్చే నెల జూలై నుంచి రుణమాఫీ అమలవుతుందని తెలిపారు. రూ.31 వేల కోట్లతో రైతుల రుణమాఫీ జరుగుతుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన పేదవాళ్లకు ముందు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్‌ పివి రామకష్ణ, ఎంపీడీవో శేషాద్రి కాంగ్రెస్‌ జిల్లా నాయకులు చావా శివరామకష్ణ, రామ సహాయం నరేష్‌ రెడ్డి జెడ్పిటిసి బెల్లం శ్రీనివాస్‌,ఎంపీపీ బోడ మంగీలాల్‌, మాజీ సర్పంచ్‌ రామ సహాయం హరిత రెడ్డి ప్రముఖ న్యాయవాది సహాయం అరవింద్‌ రెడ్డి మిరియాల విక్రమ్‌ రెడ్డి, పోట్ల కిరణ్‌, లంజపల్లి శ్రీనివాస్‌, మోర విజయపాల్‌ రెడ్డి, దూదిమెట్ల వెంకట్‌, జాల కిరణ్‌, పల్లె మల్లయ్య, కొజ్జా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సుబ్లేడ్‌ చెరువును రిజర్వాయర్‌ చేసేందు పరిశీలించండి
సుబ్లేడు చెరువును రిజర్వాయర్‌ చేసేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించాలని ఇరిగేషన్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. మండల పర్యటనలో భాగంగా శనివారం ఆయన పలు గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు.