హుస్నాబాద్ లో శ్రావణ మాసం సందడి

– ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో శ్రావణ మాసం సందర్భంగా సోమవారం హుస్నాబాద్ లోని శివాలయం దగ్గర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టకు పాలు పోసి పూజలు చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో మహిళలు పుట్ట వద్దకు పాయసం, జాజి, సంపెంగ,,గన్నేరు,,వంటి పుష్పాలతో నాగ ప్రతిమకు పంచామృతం లో కలిపి పుట్టలో పోశారు. మరకత లింగేశ్వర ఆలయంలో భక్తులు దేవుని దర్శనం కోసం భారీగా బారులు తీరారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, కౌన్సిలర్ చిత్తారి పద్మ,  మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.