రాంచీ : బీహార్ తరహాలో జార్ఖండ్‌లో కూడా కులగణన నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంపయి సొరేన్ గ్రీన్‌సిగల్ ఇచ్చారు. సర్వేకు సంబంధించి ముసాయిదాను రూపొందించాలని, దానిని ఆమోదం నిమిత్తం క్యాబినెట్ ముందు ఉంచాలని ఆయన ఆదివారం నాడు సిబ్బంది శాఖను ఆదేశించారు. అంతా ఓ ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని, లోక్‌సభ ఎన్నికల తర్వాత కులగణన ప్రారంభమవుతుందని ఓ అధికారి తెలిపారు. ‘జనాభా ఎక్కువగా ఉంటే వాటా అధికంగా వస్తుంది. బీహార్ సిద్ధంగా ఉంది’ అంటూ సొరేన్ అంతకుముందు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. బీహార్ తరహాలోనే జార్ఖండ్‌లో కూడా కులగణన నిర్వహిస్తారు. బీహార్‌లో గత సంవత్సరం జనవరి 7వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ సమాచార సేకరణ జరిగింది.