కుర్చీలు మోస్తూ,కటిక నేలపై కూర్చుని,వర్షం లో తడిచిన విద్యార్ధులు

– ఇండోర్ స్టేడియం శంకుస్థాపనలో….
– ఎం.పీ,ఎమ్మెల్యే హాజరు….
– పార్టీ శరేణులు తక్కువ,విద్యార్ధులు ఎక్కువ
– జాతీయ క్రీడా దినోత్సవంలో విద్యార్ధులకు ఇక్కట్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట : రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించే ఇండోర్ స్టేడియం కు శంకుస్థాపన.ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లు హాజరు.నియోజక వర్గ కేంద్రం లో బుధవారం కార్యక్రమం. జాతీయ క్రీడల దినోత్సవాన్ని ఘనంగా నే నిర్వహించే ఆలోచనతో న్నారు.కానీ ఇంతటి పెద్ద కార్యక్రమంలో అధికార పార్టీ అయి ఉండీ నాయకులను,కార్యకర్తలు సమీకరించ లేక పోయారో లేక జాతీయ క్రీడలు దినోత్సవం కాబట్టి విద్యార్ధులతో నిర్వహిస్తామని ఉంటున్నారో తెలియదు.కానీ నాయకులు,కార్యకర్తలు,అనుచరులు లాంటి పార్టీ శ్రేణులు కంటే వివిధ పాఠశాల నుండి తరలించిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. సరే వారికి తగ్గా ఏర్పాట్లు ఏమైనా చేసారా అంటే అదీ లేదు.వచ్చిన విద్యార్ులు అందరూ కటిక నేలపైనే కూర్చోవలసి వచ్చింది.టెంట్ కూడా లేకపోవడంతో సందట్లో సడేమియా లా వర్షం రావడంతో విద్యార్ధులు చెట్టుకొకరు పుట్టకొకరు లా చెల్లా చెదురు అయ్యారు. ఆ వర్షంలోనే వచ్చిన ఎంపీ,ఎమ్మెల్యేలకు విద్యార్ధులు తడుస్తూనే స్వాగతం పలికారు.