మహా కుంభమేళాలో…

In Maha Kumbh Mela...బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఇది వారి మునుపటి బ్లాక్‌బస్టర్‌ ‘అఖండ’కు సీక్వెల్‌. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు వేదికైన మహా కుంభమేళాలో సోమవారం ప్రారంభమైంది. చాలా కీలకమైన సన్నివేశాలను ఈ మహా కుంభమేళాలో చిత్ర బృందం చిత్రీకరిస్తోంది. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్‌ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్‌ 25న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సమర్పణ: ఎం తేజస్విని నందమూరి, సంగీతం: థమన్‌ ఎస్‌, డీవోపీ: సి. రాంప్రసాద్‌, సంతోష్‌, ఆర్ట్‌: ఏఎస్‌ ప్రకాష్‌, ఎడిటర్‌: తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.