నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం గత రెండు రోజుల నుండి కలకలం సృష్టిస్తుంది. గత రెండు రోజుల క్రితం పెద్దపులి మంగపేట మండలం చింతపల్లి వద్ద గోదావరి నది దాటి వచ్చిందని అక్కడి అడవి శాఖ అధికారులు తెలిపారు. అధికారులు అక్కడే పులి అడుగులు గుర్తించారు. కానీ ఆ పెద్దపులి గురువారం తాడ్వాయి మండలంలో పంభాపూర్ అటవీలో రాంపూర్ నార్త్ ఏరియాలో సంచరిస్తున్నట్లు కొందరు ఆదివాసి రైతులకు గురువారం ఉదయం పులి కనిపించింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. మండలంలోని పంబాపూర్ గ్రామ శివారులోని రాంపూర్ నార్త్ అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించామని ఎఫ్ఆర్ఓ కోట సత్తయ్య తెలిపారు.పులి కి సుమారు 6 నుంచి ఏడేళ్ల వయస్సు ఉంటుందని అంచనా వేశారు. ఇది ఇక్కడి నుంచి వచ్చిందో వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.పులి పాదముద్రలు అనుసరించి పంబాపూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అంచనా వేశారు. పంబాపూర్ దాని పరిసర గ్రామాలలో అటవీశాఖ అధికారులు పంబాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకును సంచరించరాదని, పశువుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని అప్రమత్తం చేశారు.