నేటి నుండి మూడు రోజుల పాటు మైసిగండిలో..

– మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
– పెద్ద సంఖ్యలో తరలి రానున్న భక్తులు
– ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ నిర్వాహకులు
నవతెలంగాణ – ఆమనగల్
కడ్తాల్ మండలం మైసిగండి శివాలయంలో నేటి నుంచి మూడు రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండర్ ట్రస్టీ రామావత్ లక్ష్మీ శిరోలి పంతు నాయక్, కార్యనిర్వహణ అధికారిణి స్నేహలత తెలిపారు. ప్రతిఏటా వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7న విఘ్నేశ్వర పూజ, ధ్వజారోహణం, స్వామివారికి రుద్రాభిషేకం, 8న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, రాత్రి 9 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవము, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలములో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, తదుపరి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. అదేవిధంగా ఈనెల 9వ తేదీన వసంతోత్సవం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆయా తేదీలలో నిర్వహించే స్వామివారి కార్యక్రమాలకు భక్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు.