వ్యాధులను రాకుండా ఉండాలంటే దోమలు పెరగకుండా చూడాలి

In order to prevent the spread of diseases, mosquitoes should be kept from breedingనవతెలంగాణ – డిచ్ పల్లి
వ్యాధులను రాకుండా ఉండాలంటే దోమలు పెరగకుండా చూడాలని, ఇంటి చుట్టు ప్రక్కల పరిశుభ్రత పాటించాలని వై శంకర్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు బుధవారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని డిచ్ పల్లి మండలంలోని యానంపల్లి గ్రామంలో డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ పాల్గొని అవగాహన కల్పించారు.జాతీయ కీటక జనిత వ్యాధులైన దోమల ద్వారా సంభవించే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, లాంటి వ్యాధులను రాకుండా ఉండాలంటే దోమలు పెరగకుండా చూడాలని ఇంటి చుట్టు ప్రక్కల పరిశుభ్రత పాటించాలని సూచించారు. మంచినీటిలో నివసించే ఎడిస్ ఈజిప్టై అనే దోమ వలన డెంగ్యూ వ్యాధి సోకుతుందని, కాబట్టి మంచినీటి కుండీలలో లార్వా నిల్వ ఉండకుండా చూడాలని వివరించారు. ఆశా కార్యకర్తలు ప్రతి మంగళవారం, శుక్రవారం ఇంటింటికి తిరిగి డ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటిలో గల పూలకుండిలలో ,కొబ్బరి చిప్పలలో, పాత టైర్లలో ,వాడి ప్రక్కన పెట్టిన కూలర్లలో, వాడని రోలులో నీరు నిలువ ఉన్నట్లయితే లార్వా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆలాంటి నీటిని  తొలగించాలని, నీటి నిలువగల ప్రాంతాలను గుర్తించి గ్రామ కార్యదర్శికి నివేదిక అందజేయాలని కోరారు. మురికి నీటిలో ఆడ అనాఫిలిస్ దోమ నిలువ ఉంటుందని, ఇంటి చుట్టు పక్కల మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని లేకుంటే మలేరియా సంభవించే అవకాశం ఉంటుందని వివరించారు .ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి చరణ్ రాజ్ ,ఆరోగ్య సిబ్బంది గంగుబాయి, వెంకటరెడ్డి, ఆశా కార్యకర్తలు నిరోషా, మంజుల పాల్గొన్నారు.